. . . వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సాయిలు
ఇందల్వాయి, బతుకమ్మ :
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6000 కు పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వడంతో వికలాంగుల అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల జిల్లా మండల స్థాయిలో దివ్యాంగులు ఆందోళన నిర్వహిస్తారని హెచ్చరించారు. ఆయన వెంట బారెడు నవీన్, శ్రావణ్ కుమార్ గౌడ్, పిల్లి శంకర్, నారా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.