ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల నిధి

0 1,099
  • దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల నిధి అని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న దైల్తాబాద్ మండలంలోని షాపూర్  గ్రామానికి చెందిన అబ్బగోని ఆంజనేయులు  గౌడ్ కు రూ.2.50లక్షల ఎల్ఓసీ చెక్కును తోగుట  మండలంలోన తన నివాసంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి అంటే పేద మధ్య తరగుతుల నిధి అని, అనారోగ్యం తో బాధపడుతున్న వారికి ఆర్ధిక వెసులు బాటు అవుతుందని తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. గత తెరాస ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయం లో అవినీతి పాల్పడిందని విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వం అని తన ద్రుష్టి కి తీసుకొని వచ్చిన ఎల్ఓసీ కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు గాని ఇంచార్జి మంత్రి కొండ సురేఖ సహకారంతో బాధితులకు తక్షణమే అందచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య యాదవ్, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు, ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారు లాలు, బ్యాగరి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు విజయ్ రెడ్డి(అమర్), తొగుట మాజీ ఎంపీపీ గాంధారి నరేందర్ రెడ్డి, లక్కిరెడ్డి నవీన్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి, కిష్టయ్య, హర్షద్, భూపతి గౌడ్, కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.