28.8 C
Hyderabad

కుంభమేళాలో నో వెహికల్ జోన్ మళ్లీ అమల్లోకి..

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని  భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మారుస్తున్నామని అధికారులు ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈఆంక్షలు ప్రయాగ్ రాజ్ మొత్తం అమల్లో ఉంటాయన్నారు. స్థానికుల కోసం నిత్యవసరాలు తీసుకొచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. మహాకుంభమేళా బుధవారం (శివరాత్రి వేడుకతో) ముగియనుంది.

More articles

Latest article