- లక్షా యాబైవేలు చెల్లిస్తేనే పత్తాలాటకు ఎంట్రి
- 150 మందిని గోవాకు తరలించిన డబల్ ఎస్ జోడీ
- ఈడీ రైడ్ ల తరువాత తొలి ఈవెంట్ కు భారీగా తరలిన ఉమ్మడి జిల్లా పేకాట రాయుళ్లు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినపేకాట రాయుళ్లు గోవాకు తరలివెళ్లారు. తరలి వెళ్లారు అనేకంటే ఈవెంట్ ఆర్గనైజర్ లు వారిని గోవాలో క్యాసినోలో ఆడటానికి తరలించారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 150 మంది పత్తాలాడే వారిని గోవాకు తీసుకుపోయారు. గత మూడు రోజులు (7,8,9 తేదీలో జరుగుతున్నక్యాసినో కోసం) ఏజెంట్ లద్వార పేకాట రాయుళ్లను ఏరికోరి గోవాకు తరలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ పోలీస్ ఒకరు, కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన మరొకరు కలిసి గోవాలో పత్తాలాట కోసం తరలించారు. ఎస్ అనే అక్షరం తో పేరు కలిగిన ఇద్దరు సూత్రదారులు పేకాట రాయుళ్లను గోవాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించారు. రూ.1,50,000 ఇచ్చిన వారు గోవాలో ఎంజాయి మెంట్ పేరిట తరలివెళ్లారు. గత ఏడాది చివరి వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు గోవాతో పాటు గల్ఫ్, ఏషియా మైనర్ దేశాలకు టూరిస్ట్ వీసాలపై తరలించి అక్కడ పేకాట ఆడించిన విషయం ఈడి విచారణలో బట్టబయలైంది. హైదరాబాద్ కు చెందిన క్యాషినోలో బిగ్ షాట్ ల ఆధ్వర్యంలో ఆనాడు క్యాసినో కు తరలిన వారికి ఈడి నోటీసులు జారీ అయ్యాయి.
ఆవిషయం సద్దుమనుగక ముందే డబల్ ఎస్ లు నామధేయం కలిగిన (సంతోష్, శ్రీనివాస్ ల) ద్వయం పత్తాలాటా ఆడేవారిని పకడ్బందిగా గోవాకు తరలించారు. అందులో పత్తాలాటా షోకు కలిగిన వివిధ వ్యాపార వర్గాలతో పాటు అధికారులు, అనాధికారులు ఉన్నట్టు సమాచారం. రూ.1,50,000 చెల్లించిన వారికి ఉచిత ప్లైట్ టికేట్ లతో పాటు వసతి, భోజనం, మద్యం సరఫరా చేయడం జరుగుతుందని తెలిసింది. గోవాకు వెళ్లిన వారికి రూ.1,50,000 విలువైన కాయిన్స్ ఇస్తారు.. వాటిని ఆడటం ఎంజాయ్ చేసి రావడం గోవా ట్రిప్ ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో పత్తాలాటాను నిర్వహించిన డబల్ ఎస్ పేరుగల వ్యక్తులు తరువాత కాలంలో ఆదిలాబాద్, ధర్మాబాద్, అప్పారావు పేట్, బోరి, దేగ్లూర్ ప్రాంతాలలో పేకాట క్లబ్ లు నిర్వహించారు. అక్కడ ప్రస్తుతం పేకాటకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో అయిన కూడా పేకాట రాయుళ్లు పత్తాలాటకు ముందుకు వస్తుండటంతో ప్రతి సీజన్ లో గల్ఫ్ తో పాటు గోవాలో జరిగే క్యాసినోకు తరలించడం ఆనావాయితీగా పెట్టుకున్నారు.
అందుకు ఏజెంట్ లను పెట్టుకుని డైరెక్ట్ గా వాట్సప్ గ్రూప్ లలో ఆహ్వానం అందించారు. పత్తాలాడి ఎన్ని పైసలు పోగొట్టుకుంటే ఏజెంట్ లకు, ప్రధానంగా ఈవేంట్ ఆర్గనైజర్ లకు కాసుల పంటగా చెప్పాలి. దాని కోసం ఏరికోరి పత్తాలాడే వారిని ఎంపిక చేసి గోవాకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న గోవా ఈవేంట్ లో మూడే మూడు రోజులలో ఆర్గనైజర్ లు అన్ని ఖర్చులు పోను దాదాపు కోటికి పైగా వేనేకేసినట్లు సమాచారం. స్థానికంగా పేకాట నిర్వహణకు అందరికి మామూళ్లు ఇచ్చే వారు కాని గోవాలో అధికారికంగా క్యాసినోకు అనుమతి ఉండటంతో అక్కడి వారితో ఆర్గనైజర్స్ కలిసి ఎలాంటి కష్టం తెలియకుండానే కోట్లు కూడ బెడుతున్నారు.
