34.3 C
Hyderabad

కోటి ఇచ్చుకో పని చేసుకో..

Must read

📰 Generate e-Paper Clip

  • హైవేల పనుల్లో నాణ్యతను ఎత్తిచూపుతూ బెదిరింపులు
  • చర్చనీయాంశమవుతున్న పెద్దాయన పుత్రరత్నం తీరు
  • ఆ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన పోరు
  • తక్కువకు కోట్ చేసి పనుల నాణ్యతను పట్టించుకోని కాంట్రాక్టర్లు

 

నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి జిల్లా పరిధిలో  ఒకటి కాదు రెండు ఏకంగా రూ.884 కోట్లు వెచ్చించి చేపడుతున్న హైవేల పనులపై ప్రభుత్వ పెద్ద పుత్రరత్నం కన్నుపడిందని, కాంట్రాక్టర్లను అడుగడుగునా అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టిస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోటి ఇచ్చి పనులు చేసుకోవాలని ఓ కాంట్రాక్టర్ కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక సదరు కాంట్రాక్టర్ రూ.50లక్షల వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. మొత్తం ఇస్తేనే పనులు చేసుకోవాలని లేకపోతే పనులు జరగనిచ్చేది లేదని స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే డబ్బుల కోసం కాంట్రాక్టర్ పైకి అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను ‘పుత్రరత్నం’ ఉసిగొల్పుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు. రూ.498 కోట్లతో 765డీ జాతీయ రహదారి పనులను

Give me a crore and work..

మెదక్ నుంచి రుద్రూర్ వరకు చేపడుతున్నారు. అలాగే రూ.386 కోట్లతో 161 బీబీ జాతీయ రహదారిని మద్నూర్ – సొనాల – తడిహిప్పర్గా – లింబూర్ – సిర్పూర్ – పొతంగల్ – కోటగిరి – రుద్రూర్ – బోధన్ – బాసర – భైంసా వరకు చేపడుతున్నారు. ఈ పనులను సుమారు 35శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను మాత్రం ప్రారంభించారు. అయితే తమ నియోజకవర్గం పరిధిలో నుంచి వెళ్తున్న హైవే పనుల్లో ఏదో ఒక వంక చూపుతూ పెద్దాయన పుత్రరత్నం భారీగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే

Give me a crore and work..

పనుల్లో నాణ్యత లోపిస్తోందంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు అంటున్నారని, అంతటితో ఆగకుండా నేషనల్ హైవే అథారిటీ అధికారుల వరకు వెళ్లారని సమాచారం. ‘పుత్రరత్నం’ గతంలో కూడా ఇసుక దందాను ప్రభావితం చేసి భారీగానే దండుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే రాజకీయ వర్గపోరుతో అతలాకుతలం అవుతున్న ఆ నియోజకవర్గం లో ఇప్పుడు కమీషన్ల కోసం వేధింపుల టాపిక్ నడుస్తోంది.

Give me a crore and work..

  • రాజకీయాలకు బలవుతున్న కాంట్రాక్టర్లు..

ఆ నియోజకవర్గంలో రాజకీయాలకు కాంట్రాక్టర్లు బలవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన ముఖ్య నాయకులు ప్రభుత్వ పనులను తమ వర్గానికంటే తమ వర్గానికంటూ పోటీపడుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధి పనులను తన వర్గానికి అప్పగిస్తూ మొదటి నుంచి పార్టీకి మద్దతుగా ఉంటున్న తమను పట్టించుకోవడం లేదని కొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అంతటితో వదిలేయకుండా ఫిర్యాదుల వరకు తీసుకెళ్తున్నారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ మానసిక వేదనకు గురై కన్నుమూశాడని, ఆ కీలక ప్రజాప్రతినిధితోపాటు ఆయన పుత్రరత్నం తీరుమార్చుకోని పక్షంలో బహిరంగంగానే ఎదిరిస్తామని పార్టీ నాయకులు అంటున్నారు.

Give me a crore and work..

  • లెస్ కి కోట్ చేసి.. నాణ్యతను మరిచారు

నిర్ణీత ధరకు సుమారు 35శాతం తక్కువ కోట్ చేసి హైవేల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించుకోవడం లేదు. కల్వర్టులు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారని, సైడ్ వాల్స్  నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదని ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. తాము హైవేలు వస్తున్నాయని వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఇస్తే పనులు ఈ విధంగా చేపడుతున్నారంటున్నారు. నాణ్యత పాటించి పనులను చేపట్టాలని కోరుతున్నారు.

Give me a crore and work..

More articles

Latest article