24.3 C
Hyderabad

అఖండ2 మూవీ మేకర్స్‌కు మరో షాక్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: అఖండ2 మూవీ మేకర్స్‌కు మరో షాక్ తగిలింది.   సినిమా టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోరులో  శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.  టికెట్ ధరలతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై కూడా తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షో ప్రారంభం కానున్నాయి. కాగా, అఖండ మూవీ విడుదల ముందు రోజు డిసెంబర్ 11న రాత్రి 8 గంటల షోకు టికెట్ రేట్ రూ.600కు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అలాగే  విడుదలైన రోజు నుంచి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

More articles

Latest article