ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా పరిధిలోగల గల్లి వాసులకు గత కొన్ని మాసాలుగా తాగునీటి కొరత ఏర్పడడంతో సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్ తో పాటు తీర్మాన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ కు దృష్టికి తీసుకెళ్లగా శుక్రవారం ఇరువురు సర్పంచులు కలిసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని మాసాలుగా తాగునీటి కొరతతో అనేక ఇబ్బందులు పడ్డామని అదే కాలనీకి చెందిన యుగేందర్, మ్యాదరి నడిపి గంగారాం, పిల్లి గంగాధర్, తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం తండా సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్, తీర్మాన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్, గంగారం తండా ఉప సర్పంచ్ ధూమ నాయక్, తీర్మాన్ పల్లి ఉప సర్పంచ్ జరుగు రవి, పంచాయతీ కారోబార్ నరేందర్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.