26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒకరికి 6నెలల జైలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒకరికి 6నెలల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. 2020 జులై 17న బిచ్కుంద మండలానికి చెందిన ఈడెం శివకుమార్ తల్లి ఈడెం పోచవ్వ జాకెట్ పీసులు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. గుర్తు తెలియని వక్తి ఆమె వద్దకు వచ్చి నీ బ్యాంకులో పింఛన్ డబ్బులు వచ్చాయని మాయమాటుల చెప్పి పక్కనున్న సందులోకి తీసుకెళ్లి ఆమె మెడలోని సుమారు తులం బంగారు గొలుసును లాక్కొని వెళ్లాడు. దీంతో బాధితుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పరిశోధనలో భాగంగా చుట్టు పక్కల వారిని విచారించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలు, పాత నేరస్తుల ఆధారంగా పెద్ద ఎడిగి గ్రామానికి చెందిన వాగ్మారే దిగంబర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారాన్ని దొంగిలించిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ బంగారాన్ని పెద్ద ఎడిగి గ్రామానికి చెందిన సుబ్బుర్ వార్ తుకారాం కు అమ్మినట్లు తెలిపారు. దీంతో దొంగసొత్తు కొనుగోలు చేసిన తుకారం ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా ఆరునెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

More articles

Latest article