. . . విద్యా వారోత్సవాల ముగింపులో కళాశాల ప్రిన్సిపాల్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మి నారాయణ ఆకాంక్షించారు. కమిషనర్, కళాశాల విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఆదివారం కార్యక్రమానికి ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కల్పన (బిజెడ్ సి), తనజు తరిన్ (బీకాం), సుస్మిత (ఎంపీసీఎస్), సరస్వతి (ఎంపీసీ), నవీన్ (బి.ఏ) లకు బహుమతులు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.

కళాశాలలో చదివిన పలువురు విద్యార్థులు ప్రస్తుతం పీజీ, బి.ఎడ్‌లో ర్యాంకులు సాధిస్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ క్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ వి.శంకరయ్య, టిఎస్ కేసి సమన్వయకర్త శివకుమార్, అధ్యాపకులు నాగనిక, సైన్స్ ఇంచార్జ్ డాక్టర్ బి.అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ పీవోలు ఎస్.చంద్రకాంత్, జి.రాణి, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దిరాజు, డాక్టర్ గోదావరి, శశిధర్, సంతోష్, రాజు దశరథ్, మైమూద్, వసంత లక్ష్మి, హరికృష్ణ, వరుణ్, రవీందర్, అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.
