26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా రాజా బహదూర్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  నేవూరి రెడ్డి (మాలీసు పటేండ్ల ) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  రాజా బహదూర్  156 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ  బహదూర్ వెంకట్రామ రెడ్డి (1869–1953) హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (కొత్వాల్) గా పనిచేసిన ఒక ప్రసిద్ధ పోలీసు అధికారి అని అన్నారు.నిజాం పాలనలో, సాధారణంగా ముస్లింలు నిర్వహించే ఈ పదవికి నియమితులైన మొదటి హిందువు ఈయనే,  అతని 14 ఏళ్ల పాలనలో ప్రజల నుండి అపారమైన గౌరవం సంపాదించారు. నిజాంకు విశ్వాసపాత్రుడై ఉంటూనే, ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా నిలిచారన్నారు. ఉన్నత చదువు అందరికీ అందుబాటులో ఉండే విధంగా హైదరాబాదులో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించిన మహానుభావుడు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నేవూరి రెడ్డి(మాలీసు పటేండ్ల) సంక్షేమ సంఘం అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నేవూరి గోపాల్ రెడ్డి,కోశాధికారి నేవూరి మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి నేవూరి నవజీవన్ రెడ్డి,ముత్యాల లింగారెడ్డి,ముత్యాల వెంకటరెడ్డి, నేవూరి నరసింహారెడ్డి, మల్లారపు రవీందర్ రెడ్డి,తెలకల నరసింహ రెడ్డి,నేవూరి రామేశ్వర్ రెడ్డి,నేవూరి రవీందర్ రెడ్డి,మల్లారపు నారాయణ రెడ్డి,ఓలాద్రి వేణు రెడ్డి,గొలిపెల్లి ఎల్లారెడ్డి,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Raja Bahadur Jayanti celebrations in full swing

More articles

Latest article