మోదీ పిలుపుతో ఎలక్ట్రిక్ కారెక్కిన ఎమ్మెల్యే

0 8,983

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదివారం ఈవీ (ఎలెక్ట్రిక్ వెహికల్)లో ప్రయాణించారు. నగరంలోని పలు కార్యక్రమాలకు ఈవీ కారులోనే వెళ్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. భారతదేశం 85 శాతం పెట్రోల్, డీజిల్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. కావున ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రధాని మోదీ బంగారం, పెట్రోల్, డీజిల్, వంట నూనె తదితర వాటిని ఆదా చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తాను ఎలక్ట్రిక్ వాహనంలో కార్యక్రమాలకు హాజరు కావడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రధాని మోదీ పిలుపును పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు.

 

Leave A Reply

Your email address will not be published.