వేల్పూర్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రత్యేక ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చీతా ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక భారీ 14 టైర్స్ లారీని గుర్తించి వెంటనే పట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ లారీ ద్వారా ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తమైంది. వెంటనే వాహనాన్ని నిలిపివేసి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి, పట్టుబడిన లారీని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
