సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

0 9,916

 

. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

లింగంపేట్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. లింగంపేట్ మండలం షట్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు మంగళవారం అక్షరాభ్యాసం చేయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలక, బలపాలను అందజేశారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

 

One should make good use of the facilities.

 

ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల హాజరు, అభ్యాస నైపుణ్యాల పెంపు, ప్రాథమిక విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించి అభినందించారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక కిరాణా దుకాణాల యజమానులకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే డబ్బాలను, టిఫిన్ బాక్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, ఎంపీడీవో నరేష్, ఎంఈఓ మల్లికార్జున్, గ్రామ సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ యాదవ్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

One should make good use of the facilities.

Leave A Reply

Your email address will not be published.