28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఉగాది పచ్చడి లానే జీవితం కూడా సుఖ దు:ఖాల సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డా.బట్టు విఠల్

 

. . . సంప్రదాయాల నడుమ ఉగాది సంబరాల సందడి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఉగాది పచ్చడిలోని రుచుల మాదిరిగానే జీవితం కూడా సుఖదుఃఖాల సమ్మేళనమని, వాటిని సమానంగా స్వీకరించే సంస్కృతి మనదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డా.బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముదిరాజ్ జాతి ఐక్యతకు ప్రతీకగా ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామ గ్రామాన జెండా ఎగురవేయాలన్న (టీఎంఎంఎస్) తెలంగాణ ముదిరాజ్ మహాసభ పిలుపు ఎల్లారెడ్డిలో కార్యరూపం దాల్చింది. పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని ‘దేవునిపల్లి’ గ్రామంలో గురువారం ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు కలిసి ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ, పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరణను శుభప్రదంగా ప్రారంభించారు. ‘పరాభవ నామ సంవత్సరం’ ఆరంభాన్ని పురస్కరించుకుని ‘కులదేవత పెద్దమ్మ తల్లిని’ స్మరించుకుంటూ సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. అనంతరం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఆరు రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ నాయకులు ముదిరాజ్ జాతి చారిత్రక సంప్రదాయాలను కాపాడుతూ కొత్త తరానికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ మూలవాసి జాతిగా ముదిరాజ్ సమాజం తన ప్రత్యేకతను నిలబెట్టుకొని, గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండా ఎగురవేసి జాతి గౌరవాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ గ్రామాన నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ జాతి ఐక్యతకు నాంది పలికిందని డా. బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు.

More articles

Latest article