డిఇఓ కార్యాలయంలో సిబ్బందికి నోటిసులు జారీ

0 9,623

సిబ్బంది కోసం సార్ ఎదురు చూపులు

. . .సమయపాలన పాటించాలని సిబ్బందిపై డి ఈ ఓ ఆగ్రహం

…  సిబ్బందికి ముకుమ్మడిగా నోటీసులు జారీ

 నిజామాబాద్, బతుకమ్మ :

సార్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడో అనే విషయం చాలా మంది సిబ్బందిని అడిగితే అధికారులు గురించి తెలిసి రాదు. కానీ సిబ్బంది ఎప్పుడు కార్యాలయంలో ఉంటారో, ఎప్పుడు ఉండరో అనే విషయం ఖచ్చితంగా నిత్యం కార్యాలయంకు వచ్చే అధికారులకు తెలిసిపోతుంది. అధికారులు ఫీల్డ్ విజిట్ కు వెళ్ళినప్పుడు మాత్రమే సిబ్బంది ఇష్టారాజ్యం గా వ్యవహరించడం అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం జరిగే తంతు. కాని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఉన్న  ఓ జిల్లా కార్యాలయంలో సార్ ఎలాగు ఫీల్డ్ కు వెళతాడు… తమను అడిగే వారు ఎవరు అన్న ధోరణిలో కార్యాలయంలో సిబ్బంది ఉండకుండా ఆఫీస్ కు రాకుండా, క్యాంటీన్ లో బాతాఖానీ కొడుతున్న వ్యవహారం జిల్లా బాస్ దృష్టికి వెళ్లడంతో రెండు రోజులు కార్యాలయంలో ఉండి ముకుమ్మడిగా సిబ్బందికి నోటీసులు జారీ చేశారు…

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం పై డిఇఓ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో డీఈవో ఆఫీసు కొనసాగుతున్న అధికారులు సిబ్బంది ఇష్టారాజ్యం గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి స్వయంగా సిబ్బంది సమయానికి రావాలని లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసులు జారీ చేసి సిబ్బందితో సంతకాలు చేయించుకున్నారు. మంగళవారం ఆఫీస్ సిబ్బంది సమయానికి రావడం లేదు ఆఫీస్ యందు ఉదయం మధ్యాహ్నం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ సిబ్బంది రోజు సమయానికి రాకుండా 11 నుంచి 11:30 వరకు వస్తున్నారని అదేవిధంగా లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఉండాల్సింది మూడున్నర వరకు రావట్లేదు అని గమనించారు. రేపటినుండి తప్పనిసరిగా సమయం పాలన పాటించాలని ఆదేశించారు. అంతేకాకుండా  సమగ్ర శిక్ష అభియాన్ లో వచ్చిన నిధులు, ఖర్చులపై ఆడిట్ ను పూర్తి చేయాలని ఆదేశించారు

Leave A Reply

Your email address will not be published.