జై గౌడ ఉద్యమం నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు తాటిపాముల ప్రశాంత్ గౌడ్
కామారెడ్డి, బతుకమ్మ : గౌడ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జై గౌడ ఉద్యమం ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు తాటిపాముల ప్రశాంత్ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ నాయకత్వంలో జై గౌడ ఉద్యమం ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడిగా బుధవారం నియాకవ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి గీత కార్మికునికి లైసెన్సులను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఇందూరి సిద్దా గౌడ్ ,అన్నగోని నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.