ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరం పావని ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను ఉప సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కలిసి పావని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఇస్సాపల్లి మహేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆశీరెడ్డి హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.31 వేల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ పావని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఇస్సాపల్లి మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఆశీరెడ్డి హన్మంత్ రెడ్డితో పాటు పలువురు మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం శ్రీనివాస్ రెడ్డి, సామా శ్రీనివాస్ రెడ్డి, శశిధర్, వసంత్ రావు నాయక్, ఇస్సాపల్లి రాజు, కేతిరెడ్డి నర్సారెడ్డి, చాట్ల జనార్దన్, సున్నపు లక్ష్మి శ్రీనివాస్ ముదిరాజ్, లోలపు రాజు, బొల్లపల్లి సుమన్ గౌడ్, ద్యాగ ప్రసాద్, అమృ నాయక్, అఖిల్ నాయక్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
