బూటకపు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలి

0 14,676

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, 27 మంది ఆదివాసులను బూటకవు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడానికి ఖండిస్తూ,సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరపాలని,ఆపరేషన్ ‘కగార్’ని వెంటనే ఆపివేసి, మావోయిస్ట్ లతో శాంతి చర్చలు జరపాలని వామ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఐ (యం),సి.పి.ఐ. (యం.ఎల్) మాస్ లైన్, సి.పి.ఐ. (యం.ఎల్) న్యూ డెమోక్రసీ,బహుజన సమాజ్ పార్టీ,పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక, ఆధ్వర్యంలో గురువారం యన్. ఆర్, భవన్, కొటగల్లి, నిజామాబాద్ యందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, భగత్ సింగ్ విగ్రహం ముందు నల్లగాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పౌర హక్కుల సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి  ఆల్గోట్ రవీంధర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడారు. వహించి మాట్లాడారు.ఈనెల 21న చత్తీస్ గడ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లా మూడ్ అడవుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బలగాలు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు, 27 మంది ఆదివాసులను బూటకపు ఎన్ కౌంటర్లో హత్య చేయడం కార్పొరేట్ కంపెనీల కోసమేనని అన్నారు. మధ్యభారతదేశంలోని అటవీ ప్రాంతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను ఆధాని, అంబాని, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వందలకు పైగా ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. అందుకోసం అటవీ ప్రాంతంలో నివశిస్తున్న ఆదివాసి ప్రజలను అడవినుంచి తరలించడానికి 20 వేల పోలీసు బలగాలను మొహరించి, క్యాంపులను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆదివాసి ప్రజల సంప్రదాయాలను, జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా, ప్రకృతి, ఖనిజ సంపద రక్షణకై ఆదివాసులు పోరాడుతున్నందుకే ఆదివాసులను ఎన్ కౌంటర్స్ పేరుతో కాల్చంపుతున్నారని అన్నారు.

An investigation should be conducted into the fake encounter.

Leave A Reply

Your email address will not be published.