26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సోమార్ పేట్ ఘటనలో బాధ్యులందరిపై హత్యయత్నం కేసులు పెట్టి అరెస్టు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లేకపోతే 19న ఎల్లారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ

 ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట ఘటనలో నిందితులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి జేఏసీ నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ….  ఈ నెల 15న సోమార్ పేట్ లో సర్పంచ్ తమ్ముడు చిరంజీవి  తన  ట్రాక్టర్ తో ఢీ కొట్టిన ఘటనలో కేవలం ఒకరి మీదనే కేసు చేసి రిమాండ్ కు తరలించారని, కేసుతో సంబంధం ఉన్న మిగతా వారిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై  24 గంటల్లో  కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే  ఈ నెల 19న ఎల్లారెడ్డి బంద్ కు పిలుపు ఇస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు ప్రకటించారు.

More articles

Latest article