నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటికీ చెందిన 4వ వార్డు బీజేపీ పార్టీ నాయకులు హరీష్, వారితో పాటు దాదాపు 30 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ఆదివారం వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీల నుండి నాయకులు చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుందని, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరావేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మాజీ ఎంపీపీ సురేందర్, బైండ్ల మహేష్, మందుల కిరణ్,గంగాధర్, హరీష్, ప్రితం, ప్రణయ్, రాములు, గంగాధర్, అశోక్, సురేష్, మహేష్, కిరణ్, బాలయ్య, గంగన్న, బాల గంగాధర్, సాయికిరణ్, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.