29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నంది విగ్రహానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

సదాశివ నగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో గల భూంపల్లి గ్రామంలో శ్రీ అంబరీశ్వర స్వామి దేవాలయం రహదారి వద్ద తోరణం, నంది విగ్రహానికి రుస్తుం మౌనిక నవీన్ రావు దంపతులు భూమి పూజ చేశారు. గత స్తంభం విగ్రహ దాత సంగెం రాజమణిరాములు, నవగ్రహ భూమి పూజ విగ్రదాత మొడేగం రామ్ రెడ్డి విగ్రదాతలుగా ఉన్నారు. ముందుగా నంది విగ్రహం కు రుస్తుం  మౌనిక నవీన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రుస్తుం  మౌనిక నవీన్ రావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా అంబరీశ్వర స్వామి ఆలయం నిర్మించబడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  స్వాములు, భూంపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Bhumi Puja to Nandi idol

More articles

Latest article