. . . ఈ నెల 15 వరకు దోస్త్ -3 లో దరఖాస్తు చేసుకోవాలి
. . . జూన్ 20 న సీట్ల కేటాయింపు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ జి.జి. కళాశాలలో డిగ్రీ ప్రవేశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. జి జి కళాశాలకు మంజూరైన 1860 సీట్లకు గాను 1509 మంది విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్స్ చేసుకున్నారు, ఇంకా 351 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో ఖాళీల వివరాలు…బి.ఏ. తె.మీ.36, ఉర్దూ మీడియం 18, రెగ్యులర్ 35, రిస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ లో 54 మొత్తం బి.ఏ.లో 143 ఖాళీలు ఉన్నాయి. ఉపాధి ఆధారిత(ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో బీ.ఎఫ్.ఎస్.ఐ. 31, సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 15, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో 39, ఈ మూడు (ఏఈడీపీ) కోర్సుల్లో మొత్తం 85 ఖాళీలు ఉన్నాయి. బి.కాం. లో సి.ఏ.7, ఫైనాన్స్ 5, టాక్సేషన్ 8, అనాలైటిక్స్16, బి.సి.ఏ. 2, బి.బి.ఏ.9, మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 24, ఫిజికల్ సైన్స్ 46, హానర్స్ 6, మొత్తం బీఎస్సీలో 76 ఖాళీలు ఉన్నాయి.. కోర్సులు, ఖాళీలు తదితర వివరాలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తెలియజేయుటకు అధ్యాపకులు మొబైల్ కాల్స్ చేసి, డిగ్రీ ప్రవేశాలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు తెలిపారు.2026-27 విద్యా సంవత్సరానికి దోస్త్ షెడ్యూల్ మూడో దశ రిజిస్ట్రేషన్ జూన్ 15 వరకు, సీట్ల కేటాయింపు జూన్ 20న జరుగుతుంది కాబట్టి ఇంటర్ పాసయ్యిన విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని మెరిట్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
