29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నసురుల్లాబాద్ మండలంలోని సంగం తండాలో మేరా యువభారత్ అండ్ సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ సైకిల్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నసురుల్లాబాద్ ఏఎస్ఐ గంగారాం మాట్లాడుతూ టెక్నాలజీమయమైన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనపై పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే మేరా యువభారత్ ఆధ్వర్యంలో నేటితరం యువత ఐనా ఫిట్ గా ఉంటూ ఫిట్ ఇండియాను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ సైకిల్ డే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సైకిల్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో యువతకు వివరించారు. సైకిళ్లను నడిపిస్తూ గాలి కాలుష్యం, ఇందన ఖర్చును తగ్గిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారని, అలాగే ఆరోగ్యవంతంగా ఉంటూ ఆరోగ్య భారతాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు రాకెట్ లాగా దూసుకుపోతున్నాయన్నారు. ఒకప్పుడు ఈ దేశంలో సైకిల్ లు నడిపి మన తాతలు, ముత్తాతలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటూ 100 సం జీవించారన్నారు. కానీ నేడు 40 సం లకే హార్ట్ ఎటాక్, షుగర్, మోకాళ్ళ నొప్పులు అని బాధపడుతూ జీవిత కాలాన్ని తగ్గించుకుంటున్నామన్నారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటికి కచ్చితంగా ఒక సైకిల్ ఉండేదని, కానీ ఈ రోజుల్లో సైకిల్ కేవలం చిన్న పిల్లలకు ఒక ఆట వస్తువుగా మారిపోయిందని, ఎవరూ కూడా సైకిళ్లను నడపడం లేదన్నారు. యువతకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఈ సైకిల్ రేస్ లో పాల్గొన్న విజేతలకు క్రికెట్ బ్యాట్, బాల్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు లాల్ సింగ్, వాసు, మోహన్, శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article