24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్ తారాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్ దినోత్సవం పై తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఎస్సై పి. సాయన్న, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

The right to vote is like a diamond weapon.

More articles

Latest article