. . . మిస్సింగ్ కేసు నమోదు
కామారెడ్డి, బతుకమ్మ:
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో చోటు చేసుకుంది.కామారెడ్డి పట్టణం లోని గాంధీనగర్ కు చెందిన లయ అనే వివాహిత తన కొడుకు శివ, ఇద్దరు కూతుర్లు బిందు, దివిజ లతో కలిసి అదృశ్యం అయ్యారు. గత రెండు రోజుల క్రితం నలుగురు కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి అయిన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. వారి ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనవరి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సమస్యను పరిష్కరించారు. కానీ నలుగురు కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
