విద్యార్థినికి ఉపాధ్యాయుడి వాట్సాప్ మేసేజ్ లు

0 2,450

. ఇంగ్లిష్ టీచర్ కు దేహశుద్ధి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా లోని మోపాల్ మండలంలో ఉన్న ఓ జెడ్పీ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వ్యక్తి పదో తరగతి విద్యార్థినికి వాట్సాప్ మెసేజ్ లు చేశాడు. సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో పాఠశాలకు చేరుకున్న వారు ఇంగ్లిష్ టీచర్ కు దేహశుద్ధి చేశారు. ఇంకెప్పుడూ తన ద్వారా తప్పు జరగదని ఆ టీచర్ కాళ్లావేళ్లా పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేసినట్లు సమాచారం. మరో ఆరు నెలల్లో సదరు ఉపాధ్యాయుడు రిటైర్ కానున్నారు. ఆ వయస్సులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థినికి మెస్సేజ్ లు చేయడం కలకలం రేపింది. విషయం ఆలస్యంగా తెలియడంతో మోపాల్ పోలీసులు పాఠశాలకు వెళ్లి ఆరా తీసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.