25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మార్కెట్ యార్డును ముట్టడించిన సోయా రైతులు

Must read

📰 Generate e-Paper Clip

 మద్నూర్, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లాలో సోయా రైతులు సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు. రైతుల వద్ద ఉన్న వేల క్వింటాళ్ల  సోయాను కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం ఎలా ముసివేస్తారని సొసైటీ కార్యదర్శిని ప్రశ్నించారు. దాదాపు పక్షం రోజులుగా మద్నూర్ మార్కెట్ యార్డ్ కు సోయాలు తీసుకువచ్చిన రైతులు కొనుగోలు కేంద్ర (మద్నూర్ పిఎసీఎస్) తెరిచే అవకాశం లేకపోవడంతో సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు.

Soya farmers besieged the market yard

ఉమ్మడి మద్నూర్ మండలంలోని రైతుల మద్నూర్ మార్కెట్ యార్డుకు  50 మంది రైతులు  8 వేల క్వింటాళ్ల సోయాలను అమ్మకానికి తెచ్చిన కొనుగోలు కేంద్రం  తెరువకపోవడంతో నిరసనకు దిగారు. ఈ సీజన్ లో గత ఏడాది అక్టోబర్ 7 న సోయా కోనుగోలు కేంద్రంను తెరిచిన అధికారులు 2460 మంది నుంచి 9300 క్వింటాళ్ల సోయాలను కోనుగోలు చేశారు. తరువాత వచ్చిన సోయాలను కొనుగోలు చేయకపోవడంతో దాదాపు 15  రోజులుగా మార్కెట్ యార్డు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సోయాల కొనుగోలు కేంద్రంను తెరువాలని ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కర్షకులను అదుకోవాలని డిమాండ్ చేశారు.

Soya farmers besieged the market yard

More articles

Latest article