విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదు

0 9,895

 

. . . కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం

 

. . . నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ అర్వింద్, వారి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకులు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే పార్టీ పై బురద చల్లడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను దిగమింగుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే సొంతం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో 6 నెలల్లో 65 వేల నుండి, 70 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అలాగే పేద ప్రజలకు 3500 వరకు ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యునిట్ల లోపు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ పెంచడం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. నీట్ పేపర్ లీకేజీ అయితే కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత తీస్కొని రాజీనామా చేయించలేని మీరు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి దొంగతనం చేసే విధంగా ప్రోత్సాహిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడటం రాష్ట్రానికి, జిల్లాకు మంచిది కాదని అన్నారు. ముందుగా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలను నెర వేర్చాలని, ఇప్పటికయినా బీజేపీ నాయకులు ప్రతి పక్ష పాత్ర వహించి మా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండని, అందరం కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద గానీ, రాష్ట్ర ప్రభుత్వం పై న గానీ విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.