ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని జీకే తాండ సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తొలగించి, సొంత గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వ పాఠశాల పై నమ్మకం పెరుగుతుందని సర్పంచ్ వెల్లడించారు. పాఠశాలలో ప్రభుత్వం నాణ్యమైన ఆహారంతో పాటు, ఉచితంగా బుక్స్, యూనిఫామ్, అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జికే తండా సర్పంచ్ శిరీష మైపాల్ నాయక్ తో పాటు, తండా పెద్దలు పాల్గొన్నారు.
