ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓను సవరణ చేయాలి

0 1,402

జాక్టో చైర్మన్ చీమల శ్రీకాంత్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విడుదలైన జీవో నెంబర్ 25 శాస్త్రీయంగా లేదని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పేర్కొంది. 11 నుంచి 60 వరకు విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే బోధించడం అనేది పరోక్షంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటమే అని అన్నారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ను ఏర్పాటు చేసి బోధిస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. ఒకవైపు కొత్త డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నింపుతామని, మరోవైపు డీఎస్సీ 2008 లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని తెలుపుతూ ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరించటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 25 ద్వారా హేతుబద్ధీక రించితే ఉపాధ్యాయులందరినీ ఎక్కడ ఉంచుతారని అన్నారు. వీరు బోధించడానికి పాఠశాలల్లో ఖాళీలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ అంశంపై విద్యాధికారులు ఆలోచించకుండానే, ఉపాధ్యాయ సంఘాలతో ఎటువంటి చర్చలు లేకుండానే జీవోలు విడుదల చేయటాన్ని జాక్టో ఖండిస్తుందని తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియార్టీని గుర్తించకుండా ఎంఎన్ఓ లు ఉన్న వారందరినీ మండల విద్యాధికారిగా ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంపై నిరసనను తెలియజేశారు. ప్రతి మండలానికి ఒక పూర్తి స్థాయి ఎంఈఓ నియమించటాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. కానీ దీనిలో ప్రధానోపాధ్యాయుల సీనియార్టీని పాటించి సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ లుగా బాధ్యతలు అప్పగించాలని జాక్టో కోరుకుంటుందని తెలిపారు.  దీనిని సవరించాలని  మోపాల్ మండలంలోని వివిధ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ చీమల శ్రీకాంత్, ఎస్టీయూ అద్యక్షులు ధర్మెంధర్ ,టీటీయూ అద్యక్షులు లాటికర్ రాము,ఎస్టీయూ మండల బాధ్యులు శశేందర్,పవన్ కుమార్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.