- జిల్లా కలెక్టర్ కు పీడీఎస్యూ వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని ప్రగతీ శీల ప్రజాసౌమ్య విద్యార్ధి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ను పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలానికి కేటాయించడం జరిగిందని, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50 ఎకరాల స్థలం కబ్జా చేశారని తెలిపారు. విద్యార్థి పోరాటాలతో జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించామని తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ భూమిని హైకోర్టులో కేసు వేసి అన్యాయంగా అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, యూనివర్సిటీ కి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు ప్రిన్స్,రవీందర్,శివసాయి, వంశి తదితరులు పాల్గొన్నారు.
