ఈ నెల 18న చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్

0 8,775

-కోర్టులలో మొత్తం 1831 చెక్ బౌన్స్ కేసులు

-రాజీకి వీలుగా ఉన్నవి 264

-నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

నిజామాబాద్ లీగల్,బతుకమ్మ :

చెక్ బౌన్స్ కేసుల పరిష్కారమే ద్యేయంగా జులై 18 న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు.వ్యక్తిగత,ఇతర అవసరాల కోసం అప్పు తీసుకున్న వారు,అప్పు ఇచ్చిన వారికి మధ్యన నడుస్తున్న చెక్ బౌన్స్ కేసులను రాజీ బాటలో నడిపించి ఒక పరిష్కారాన్ని చూపడానికే స్పెషల్ లోక్ అదాలత్ కు శ్రీకారం చుట్టుకున్నామని ఆమె తెలిపారు.జిల్లాకోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు. ఆర్మూర్,బోధన్ కోర్టులతో పాటు నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులలో 1782 చెక్ బౌన్స్ కేసులు న్యాయ విచారణ దశలో ఉన్నాయని ఆమె వివరించారు.నిజామాబాద్ సెషన్స్ కోర్టు,నిజామాబాద్ అదనపు సెషన్స్ కోర్టులతో పాటు బోధన్ లో ఉన్న అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 49 చెక్ బౌన్స్ క్రిమినల్ అప్పీళ్ళు విచారణలో ఉన్నాయని ఆమె తెలిపారు. చెక్ బౌన్స్ కేసులు మొత్తం 1832 లలో 264 కేసులు రాజీపద్ధతిన పరిష్కరించడానికి వీలుగా ఉన్నాయని జిల్లాజడ్జి భారత లక్ష్మీ వివరించారు.కేసులలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ముద్దాయిలు కోర్టు వాయిదాలకు రాకపోవడంతో 391 మందిపైన నాన్ బెయిలెబుల్ వారంట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.254 కేసులలో ముద్దాయిలు కోర్టుకు హాజరు కావాలని తెలుపుతూ సమన్స్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.వ్యక్తిగత రుణాలు రుణ గ్రహీతల నుండి తీసుకున్న వారు,ప్రయివేట్ సంస్థల నుండి అప్పు తీసుకున్న కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.అప్పుల కుప్పలో కూరుకుపోకుండా,చెక్ బౌన్స్ కేసు ఊబి నుండి బయట పడటానికి స్పెషల్ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని ఆమె అన్నారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు మాట్లాడుతూ ప్రత్యేకంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసమే స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం న్యాయసేవ అధికార సంస్థ చరిత్రలో కలికితురాయిగా నిలిచిపోతుందని అన్నారు.ప్రతి లోక్ అదాలత్ కు సహకరిస్తున్న తీరుగానే స్పెషల్ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదులు సహాయ,సహకారాలు అందిస్తారని తెలిపారు.బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అప్పు తీసుకున్న వారికి అప్పులభారం ఉండరాదని, భారాన్ని తొలగించుకోవడానికి రుణగ్రహీతలకు చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ మంచిమార్గమని అన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాదులు జీవి.కృపాకర్ రెడ్డి,పరుచూరి శ్రీధర్,నరేందర్ రెడ్డి,మాణిక్ రాజు, జగన్ మోహన్ గౌడ్,బార్ కోశాధికారి మధుసుధన్ గౌడ్,క్రీడల కార్యదర్శి పుణ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.