- రాష్ట్ర శాఖ సంచాలకుల ఆదేశాల మేరకే నియామకాలు
- గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు బాబర్, రాజులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం
- జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్
నిజామాబాద్, బతుకమ్మ ; నిజామాబాద్ జిల్లాలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సేవల కోసం నియామకాలపై జరుగుతున్న వివాదంపై జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా నియామకాల కోసం రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకే కొన్ని పాఠశాలల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ విషయంలో నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అధికారుల ప్రమేయం ఏమీ లేదు. గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాకులు బాబర్ కొందరికి నియామక పత్రాలు ఇవ్వగా, మరి కొంతమందికి రాజు అనే వ్యక్తి నియామక పత్రాలు ఇచ్చారని డీఈవో తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలకు ఇద్దరు నియామక పత్రాల తో రావడంతో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న నియామకాల విషయంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గతంలో నిరుద్యోగులను మోసం చేసిన నకిలీ నియామక పత్రాలు అందజేసిన నిర్మల్ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి ద్వారా జరిగిన నియామకలు అక్రమంగా జరిగాయని గుర్తించారు. ఈ విషయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై పోలీసుల ఫిర్యాదు చేయాలని డిఈఓ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ నిజామాబాద్ జిల్లాలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా జరిగిన నియామకాల గురించి విచారణ జరిపారు. రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుల ప్రమేయం లేకుండా డబ్బులు తీసుకొని నియమకాలు జరిగినట్టు తేలడంతో నిర్వాహకులపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులకు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ లో కొందరి సహకారం ఉందని వారికి మరి కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల అండదండలతో నియామకాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. కానీ విద్యాశాఖ అధికారి దానిని ఖండిస్తూ కేవలం ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫౌండేషన్ నిర్వాహకులు నియామకాలు చేశారని తమ శాఖకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పడం విశేషం.
