. . . చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణలోనే సహకార రంగంలో కొనసాగిన ఏకైక ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు దశలవారిగా రైతులతో ఉద్యమాలు చేస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాయి నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. పాలకుల తప్పుడు విధానాలు అధికారుల అవినీతి ఫలితంగా గత 15 సంవత్సరాల క్రితం మూతపడిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నడిపించాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని అన్నారు. ఈ ప్రాంత శాసనసభ్యులు ఆర్.భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహదారు పి.సుదర్శన్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడువు గంగాధర్ లకు ఫ్యాక్టరీ తెరిపించాలని వినతి పత్రాలు ఇచ్చినామని ఆకుల పాపయ్య అన్నారు. వీరందరూ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూనే ఇప్పుడు చెరుకును పెడతారా అంటూ ధర్మసందేహాలు వెలిబుచ్చుతున్నారని వారన్నారు. ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని నాలుగు శాసనసభ్యుల నియోజకవర్గంలోని 117 గ్రామాల రైతులు చెరుకు పండించారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధి ధర్మ సందేహలు మాని ముందు ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిపిస్తామని టన్నుకు 4 వేల ధర ప్రకటించి ముందు మొదట దఫా సీడ్ ఉచితంగా నానో సబ్సిడీతోనో విత్తనం అందిస్తామని ముందుకు వస్తే కచ్చితంగా చెరుకు పెట్టేందుకు రైతులు ముందుకు వస్తారని వారన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిపిస్తామని రైతులకు ఇచ్చిన హామీని విస్మరించారని అవేధన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు అసెంబ్లీలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు చైర్మన్ గా ఒక సబ్ కమిటీ వేసిందని వారన్నారు. ఈ సబ్ కమిటీ తమ పరిశీలన రిపోర్ట్ ప్రభుత్వానికి అందించినప్పటికీ ఫ్యాక్టరీ తెరిపించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పినా ప్రజా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారని వారన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని వారన్నారు. రైతులే తమ ఉద్యమం ద్వారా ఫ్యాక్టరీని తెరిపించుకునేందుకు ముందుకు వస్తున్నారని అందుకు దశలవారీగా రైతు ఉద్యమం చేపడతామని అన్నారు. ముందు గ్రామాల్లో ఫ్యాక్టరీలు తెరిపించాలని గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ పంచాయతీలకు పిఎసిఎస్ లు తమ తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నామని ఆయన అన్నారు. రెండవ దశలో జిల్లా వ్యాప్తంగా వందలాది ట్రాక్టర్లతో ఢిల్లీ రైతు ఉద్యమ తరహా లో పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని పాపయ్య అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంసీఎస్ఎఫ్ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి దాన్ని బెల్లం కేంద్రంగా మార్చలని వారుకోరారు. ఈ కార్యక్రమంలో ఎఐకేఎంఎస్, జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, రైతు నాయకులు నర్సారెడ్డి, కొట్టే గంగాధర్, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.