సోయాలు కొనుగోలు చేయాలని రాస్తారోకో
మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో సోయా రైతులు సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు. రైతుల వద్ద ఉన్న వేల క్వింటాళ్ల సోయాను కోనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం ఎలా ముసివేస్తారని ప్రశ్నిస్తున్నారు. దాదాపు పక్షం రోజులుగా మద్నూర్ మార్కెట్ యార్డ్ కు సోయాలు తీసుకువచ్చిన రైతులు కొనుగోలు కేంద్ర (మద్నూర్ పిఎసీఎస్) తెరిచే అవకాశం లేకపోవడంతో సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించి రోడ్డు పై రాస్తారోకో చేశారు.

ఉమ్మడి మద్నూర్ మండలంలోని రైతుల మద్నూర్ మార్కెట్ యార్డుకు 50 మంది రైతులు 8 వేల క్వింటాళ్ల సోయాలను అమ్మకానికి తెచ్చిన కొనుగోలు కేంద్రం తెరువకపోవడంతో నిరసనకు దిగారు. ఈ సీజన్ లో గత ఏడాది అక్టోబర్ 7 న సోయా కోనుగోలు కేంద్రంను తెరిచిన అధికారులు 2460 మంది నుంచి 9300 క్వింటాళ్ల సోయాలను కోనుగోలు చేసింది. తరువాత వచ్చిన సోయాలను కోనుగోలు చేయకపోవడంతో దాదాపు 15 రోజులుగా మార్కేట్ యార్డు వద్ధ పడిగాపులు కాస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే సోయాల కోనుగోలు కేంద్రంను తెరువాలని ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కర్షకులను అదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

