నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి సహకారంతో భగత్ సింగ్ 118వ జయంతి పురస్కరించుకొని అవయవ దాన నమోదు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత అవయవ, శరీర దాతల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల గంగాధర్, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ షాహిద్ భగత్ సింగ్ 197 సెప్టెంబర్ 28 ప్రస్తుత పాకిస్థాన్లోని లాహోర్ లో విద్యావతి కిషన్ సింగ్ దంపతులకు జన్మించాడని తెలిపారు. అతి చిన్న వయసు నుండే దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగిన భారతీయుడుగా భగత్ సింగ్ జీవనం కొనసాగిందని, దేశ స్వాతంత్రం కోసం పిన్న వయస్సులోనే ఉరికంబాన్ని సైతం హేళన చేస్తూ ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఇలాంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, యువకులు అందరూ కూడా సమాజంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం కొరకు ముందుకు రావాలని అందులో భాగంగా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం భగత్ సింగ్ ఆశయా సాధనలో ముందుకెళ్తూ భగత్ సింగ్ జయంతి పురస్కరించుకొని అవయవ దానం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, అవయవ దాన సంఘం వారి సమక్షంలో మరణించిన జీవించండి అనే నినాదంతో 10 మంది యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అవయవ దాన ప్రతిజ్ఞ చేస్తూ ప్రభుత్వ అవయవదాన నమోదు పోర్టల్ లో నమోదు చేసుకున్నారని తెలియజేశారు. విద్యార్థులు, యువకులందరూ కూడా అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పోషమైన మహేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా నాయకులు ఉదయ్, సూర్య, భగవాన్, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేణు,గణేష్, అభిషేక్,సాయి చరణ్ తేజతదితరులు పాల్గొన్నారు.
