23.7 C
Hyderabad

ఉమ్మడి జిల్లాలో డీఎంఈ పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

  • ఆసుపత్రుల్లో తనిఖీలు

 

కామారెడ్డి / నిజామాబాాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్  కమిషనర్ డాక్టర్  అజయ్ కుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాలో గల ఆసుపత్రుల్లో ఆరోగ్య సౌకర్యాలు, సీజనల్ వ్యాధులు నియంత్రణ, నివారణ చర్యల  కార్యకలాపాల సంసిద్ధత ఏర్పాట్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప్రతి,  కామారెడ్డి

DME visit to the joint district

జిల్లాలోని ప్రభుత్వ జనరల్  ఆసుపత్రి, దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం, భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక ప్రైవేట్ హాస్పిటల్, దేవి హాస్పిటల్ ను సందర్శించారు. ఆసుపత్రిలలో డెంగ్యూ, వైరల్ జ్వరాలవంటి అన్ని రకాల జ్వర కేసులను సీజనల్ వ్యాధుల చికిత్సలు , వైద్య సేవల కోసం  అవసరమైన అన్ని సౌకర్యాలను  పరిశీలించారు.  కాలానుగుణ వ్యాధుల కేసులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేశారు.

DME visit to the joint district

More articles

Latest article