విలువల ఆధారిత విద్య అందించడానికి నారాయణ పాఠశాల కట్టుబడి ఉంది

0 8,588

 

. . . నారాయణ పాఠశాల ఏజీఎం శివాజి పటేల్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా నారాయణ పాఠశాల సమగ్ర విలువల ఆధారిత విద్య అందించడానికి కట్టుబడి ఉందని నారాయణ పాఠశాలల ఏజీఎం శివాజి పటేల్, ప్రిన్సిపాల్ కిషోర్ లు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నారాయణ పాఠశాలలో “స్టుడెంట్ లెడ్ కాన్ఫరెన్స్” (ఎస్ఎల్ సీ) కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విద్యాపురోగతి, ప్రతిభ సాధనాలను తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎల్ సీ ప్రాముఖ్యత స్పష్టంగా ప్రతిబింబించించని, ఎస్ ఎల్ సీ విద్యార్థుల్లో భాధ్యతాభావానికి, మూల్యాంకానికి ప్రోత్సహిస్తుందని అన్నారు. అలాగే సంభాషణ, ప్రజెంటేషన్ నైపుణ్యాలకు దోహదపడుతుందని, అభ్యాస ప్రక్రియలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాంలో జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణరెడ్డి, ఈ చామ్స్ ఆర్ అండ్ డి స్వాతిలక్షిణ, కోఆర్డినేటర్ కుమారి అభిమా తదితరులు పాల్గొని విజయంతం చేసారు.

Narayana School is committed to providing value-based education.

 

Leave A Reply

Your email address will not be published.