27.5 C
Hyderabad
Friday, July 31, 2026

డ్రైవర్ల చూపు, వినికిడి మెరుగైతే  ప్రమాదాలు తగ్గుతాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

. . . అరైవ్ అలైవ్ – 2026 రెండో దశలో ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

డ్రైవర్లలో చూపు సంబంధిత సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని, సరైన చూపు, వినికిడిల ద్వారా నే ప్రమాదాలను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండవ దశ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి, వినికిడి పరీక్ష శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ శిబిరానికి స్థానిక లయన్స్ ఐ హాస్పిటల్ యాజమాన్యం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి వైద్యుల సహకరంతో భారీ వాహన, ఆటో, అంబులెన్సు డ్రైవర్లకు సమగ్ర కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించి, దూరదృష్టి లోపం, చూపు మందగించడం, కంటి ఒత్తిడి వంటి సమస్యలు ఉన్న డ్రైవర్లను గుర్తించారు.

 

If drivers' vision and hearing improve, accidents will decrease.

 

చూపు సమస్యలు ఉన్న డ్రైవర్లకు ఉచితంగా కళ్ళజోళ్లు, డ్రాప్స్, మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం అత్యవసర సమయం లో సి.పి.ఆర్ చేసి ఏ విధంగా ప్రాణాలు కాపాడవచ్చో అవగాహన కల్పించారు.

 

If drivers' vision and hearing improve, accidents will decrease.

 

ఈ సందర్భంగా కమిషనర్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ చట్టాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం, లేన్ క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ప్రయాణికుల ప్రాణ భద్రత డ్రైవర్ల బాధ్యతేనని తెలిపారు. అందువల్ల ప్రతి డ్రైవర్ కాలానుగుణంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన చూపు, ఆరోగ్యంపై శ్రద్ధ, ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పాటన ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు గణనీయంగా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, అడిషనల్ డీ.సీ.పీ (ఏ.ఆర్) రామ్ చంద్ర రావు, ఏ.సీ.పీ లు ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్.ఐ లు వినోద్, తిరుపతి, శ్రీనివాస్, ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్, ఐఎంఏ ప్రెసిడెంట్ డా.విశాల్, సెక్రటరీ హరీష్ స్వామి, లయన్స్ కంటి హాస్పిటల్ సిబ్బంది డా.దీప్తి, అలేఖ్య, వైశాలి, డాక్టర్ వినోద్ కుమార్, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

If drivers' vision and hearing improve, accidents will decrease.

 

More articles

Latest article