. . . వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ప్రాణాంతక ఎబోలా వైరస్ తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయట పడ్డాయి. ఎబోలా వ్యాప్తి ద్రష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదనైట్టు తెలిపింది.