నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ని ఎన్నుకుని, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్డిల అభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా నూతన కమిటీ, నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. వరుసగా మూడవ సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా రెడ్డిల సంక్షేమం కోసం పోరాడామన్నారు. పేద రెడ్డిల సంక్షేమం కోసం, రెడ్డి నిరుద్యోగ యువతీ, యువకుల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. నాపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతను కట్ట పెట్టినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగర్త చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సందీప్, తిరుపతి రెడ్డి, సహాధ్యక్షులు నాగిరెడ్డి, లింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
