27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

షబ్బీర్ అలీ వర్సేస్ చంద్ర శేఖర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి కాంగ్రెస్ లో ముసలం

 

. . . పార్టీ క్రమ శిక్షణ కమిటీ కి కామారెడ్డి నేతల పరస్పర ఫిర్యాదు

 

. . . గడ్డం చంద్రశేఖర్ కు షోకాజ్ నోటిసులు జారీ చేసిన డిఎసీ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ, పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి లపై వారి అనుచరులు ఒకరిపై మరోకరు పరస్పరం ప్రధేశ్ కాంగ్రెస్ కమిటి క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసుకున్నారు. దానిలో భాగంగా ఈ మేరకు పీసీసీ క్రమ శిక్షణ కమిటీ నుంచి గడ్డం చంద్రశేఖర్ కు గురువారం నోటిసులు జారీ అయ్యాయి. దానితో ఈ వ్యవహరం కామారెడ్డి కాంగ్రెస్ ను పుట్టి ముంచుతుందని చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో షబ్బిర్ అలీ శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రస్తుత పీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంధ్రశేఖర్ రెడ్డి ల మధ్య వైరం పార్టీకి చేటుగా మారింది. కామారెడ్డి బల్ధియాపై పెత్తనం పైన ఉన్న విభేదాలతో పాటు తనపై అక్రమ కేసుల వెనుక షబ్బిర్ అలీ హస్తం ఉందని చంద్రశేఖర్ రెడ్డి నమ్మడంతో విబేధాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కామారెడ్డి బల్ధియాలో హస్తం పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోలేకపోవడంపై, బీఆర్ఎస్ తో పొత్తుతో మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం కైవసం చేసుకోవడంతో అంతర్గత విభేదాలు బట్ట బయలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో బిజేపి, బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ పరువు బజారున పడింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న కామారెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కి కామారెడ్డిలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మున్సిపల్ ఎన్నికలలో చావుతప్పి కన్ను లొట్ట బోయినట్టు వలస లీడర్లకు బల్ధియాను అప్పగించారు చేతి గుర్తు పార్టీ లీడర్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన తరువాత పార్టీ వ్యవహరాలలో ప్రధానంగా పార్టీ ప్రధాన లీడర్లలో అనైక్యత పార్టీకి చేటుగా మారింది.

 

Shabbir Ali vs Chandra Shekhar

 

కామారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లి ఎన్నికలప్పుడు షబ్బిర్ అలీ నిజామాబాద్ అర్బన్ కు వలస వెల్లి పోటి చేసినప్పుడు, రేవంత్ రెడ్డి గెలుపుకోసం పని చేయలేదని ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు గడ్డం చందు వర్గీయులు. రేవంత్ రెడ్డి ఓటమికి షబ్బిర్ అలీ కారణం అని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. షబ్బిర్ అలీ వర్గం మాత్రం కామారెడ్డిలో పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని గడ్డం చంద్రశేఖర్ పై ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని పార్టీ డిఎసీ చైర్మెన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. కామారెడ్డి లో కాంగ్రెస్ ని బ్రతికించాలని నాయకుల వినతి పత్రం సమర్పించగా, సానుకూలంగా స్పందించిన క్రమశిక్షణ చైర్మన్ మల్లురవి కామారెడ్డి ఘటనపై విచారణ జరుపుతానని హమీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టిపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంధ్రశేఖర్ రెడ్డికి టిపిసీసీ (డిఏసీ) నుంచి షోకాజ్ నోటిసులు జారీ అయినట్లు తెలిసింది. దానికి కాంగ్రెస్ క్రమ శిక్షణ సంఘం ముందు గడ్డం చందు సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. షబ్బిర్ అలీపై గడ్గం చంద్రశేఖర్ వర్గం ఫిర్యాదుతో షోకాజ్ నోటిసులు, వివరణ కోరే అవకాశాలు లేకపోలేదు..

 

Shabbir Ali vs Chandra Shekhar

 

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలతో అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో షబ్బిర్ అలీ వర్సేస్ గడ్డం చంద్రశేఖర్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో కామారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పరంగా శాసించిన షబ్బిర్ అలీ వ్యతిరేక శక్తులు ఏకమౌతున్నాయని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు షబ్బిర్ అలీ కి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మదన్ మోహన్ నిరుద్యోగ జాబ్ మెళా నిర్వహణతో అవి భహిర్గతమయ్యాయి. ఆనాడు పరస్పర ఫిర్యాదులు కాస్తా కామారెడ్డిలో నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న వడ్డెపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరణకు దారి తీసాయి. టిపీసీసీ ఐటి సెల్ చైర్మెన్ గా ఉన్న మదన్ మోహన్ ను జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేయడం వివాదస్పదమైంది. ఆనాడు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో షబ్బిర్ అలీ తనయుడు ఇలియాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటి చేసిన అతడిని ఓడించడంలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలే కారణం అని వెల్లడైంది. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో టికేట్ల కేటాయింపులో పై చేయి కోసం షబ్బిర్ వ్యతిరేక వర్గం ఏకమైంది. షబ్బిర్ అలీకి టికేట్ ఇవ్వకుండా అడ్డుకున్నామని ప్రత్యర్థి వర్గం బాహటంగానే చెప్పుకున్నారు. తాజాగా ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి సైతం షబ్బిర్ అలీ వ్యతిరేకవర్గంకు దక్కిందనే టాక్ ఉంది. ప్రస్తుతం కొత్త తరంతో షబ్బిర్ అలీ కి విభేదాలతో పార్టీకి మాత్రం కష్టకాలమే అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ రెండో దఫా తామే అధికారంలో వస్తామని సీఎం రేవంత్ రెడ్డి, టిపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ఘంట పథంగా చెబుతున్నారు. కాని పీసీసీ చీఫ్ సొంత ఇలాకాలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్గ విభేదాల సమసిపోతాయా లేక పార్టీకి నష్టం జరుగకుండా ఉండాలంటే పార్టీ కఠినంగా వ్యవహరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

 

Shabbir Ali vs Chandra Shekhar

More articles

Latest article