. . . బోల్లక్ పల్లి ప్రాంతంలో ఘటన
పిట్లం, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మంజీరా నదిలో ఈతకోట్టేందుకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన శుక్రవారం పిట్లం మండలం బోల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. యువకులు గల్లంతు విషయం తెలిసి కిష్టాపూర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఘటన స్థలాన్ని పిట్లం పోలీసులు చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు డెడ్ బాడీ ల ని వెలికి తీశారు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.