. . . బిజెపి కాంగ్రెస్ మధ్యనే పోటి
. . . క్రాస్ ఓటింగ్ ను నమ్ముకున్న బీఆర్ఎస్
. . . కీలకం కానున్న మజ్లిస్ మెజారిటీ స్థానాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగర పాలక సంస్థ నాల్గవ మేయర్ స్థానం ఏ పార్టీ గెలుచుకుంటుందని చర్చ మొదలైంది.. ఎన్నికలకు మరో ఐదు రోజుల గడువు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ లు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల గోదాలో నిలిచాయి.. భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ కార్పొరేటర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున శమంతా లు బరి లో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ బరిలో ఉన్నప్పటికీ మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు.. మెజార్టీ స్థానాలను గెలిచి మేయర్ ఎంపికలో కీలక స్థానం వహించాలని మజ్లిస్ తహ తహ లాడుతుంది…
నిజామాబాద్ మేయర్ స్థానం ఈ సారి ఎలగైనా గెలువాలని బీజేపీ పట్టుదల తో ఉంది. గత బల్దియా ఎన్నికలలో28 స్థానాలు నిలిచిన కమలం పార్టీ ఈ సారి మేయర్ పీఠం ఎగురెసుకు పోవాలని ప్రణాళికలు రచిస్తుంది.ఎంపీ ధర్మపురి అరవింద్ మేయర్ సీటు గెలువాలని అవినీతి రహిత పాలన కోసం అని సగానికి పైగా సిట్టింగ్ స్థానలో తాజా మాజీలకు టికెట్ నిరకరించి కొత్తవారిని బరిలో దించింది.. ఎక్స ఆఫీసియో ఓట్లు అదనపు బలం ఉండటం తో మేయర్ కుర్చీకి స్కెచ్ వేసింది. సీనియర్ అయినా రెడ్డి సామజిక వర్గానికి చెందిన స్రవంతి రెడ్డి ని మేయర్ అభ్యర్థి గా ప్రకటించి పోటీలో నిలిచింది… గత స్థానాలను గెలిచినా మ్యాజిక్ ఫిగర్ తో మేయర్ స్థానం లో కాషాయం జెండా ఎగురావేయాలని ప్లాన్ వేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ దశబ్దం తరువాత మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసింది.. పీసీసీ చీఫ్ ఆశీస్సులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అండతో రెడ్డి సామాజిక వర్గం కు చెందిన పారిశ్రామిక వేత్త కుటుంబం కు చెందిన శమంతా కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్తిగా బరి లో ఉన్నారు..రాష్ట్రం లో అధికారం లో ఉన్నాం ఎక్స ఆఫీసియో ఒట్ల, మజ్లిస్ అండతో మేయర్ సీటు గెలువాలని వ్యూహం వేసింది.. పది సంవత్సరాలుగా అధికారానికి దూరం కావడంతో పాటు బల్దియా పీఠం ఎగిరేసుకుపోవడంలో రెండు పర్యాయాలు విఫలం అయింది. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అని మేయర్ కుర్చీ దక్కదు అని గట్టిగా కొడితే మేయర్ కుర్చీ గారంటీ అని చేతి గుర్తు పార్టీ నాయకులు ప్లాన్ లు వేస్తున్నారు.. టికెట్ ల కేటీయింపు లో అన్యాయం జరిగింది, టికెట్ లు అమ్మకున్నారు అని ఆరోపణలు వచ్చిన ఇంటి గుట్టు బయటికి రాకుండా మేనేజ్ చేసిన హస్తం పార్టీ అసమ్మతి వాదులను బుజ్జగించి వారి తోనే ఐక్యమత్యం గా ఉన్నామని చెప్పించి బరిలో నిలిచింది.. తక్కువ స్థానాలు వచ్చిన పతంగి పార్టీ మద్దత్తు తో మేయర్ గద్దేను ఎక్కాలని ప్రణాళిక లు గిసింది. గతంలో రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని మేయర్ స్థానాన్ని గెలుచుకున్న బిఆర్ఎస్ ఇప్పటికి మేయర్ అభ్యర్థి ని ప్రకటించలేదు.. 2014లో 8, 2020లొ 13 డివిజన్ లలో గెలిచినా పతంగి పార్టీ మద్దత్తు తీసుకొని దానికి డిప్యూటీ మేయర్ స్థానం ఎరగా వేసి మేయర్ పీఠం గెలిచినా విషయం విధితమే..ఆనాడు కూడా మేయర్ అభ్యర్థి ని ముందుగా ప్రకటించకుండా కలిగిన వారిని మేయర్ ను చేసిన చరిత్ర కార్ పార్టీ ది.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానం పరిమితం కావడం తో దానికి మేయర్ సీట్ మీద పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. ఎటోచ్చిన మజ్లిస్ పార్టీ ప్రతి ఎన్నకల్లో అధికార పార్టీ కి మద్ధతు ఉంటుంది కాబట్టి మిత్ర పక్షం అండ ఫై ఆశలు వదులుకుంది… అంతే గాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుదారులు అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరుపున బరిలో ఉండటం టిఆర్ఎస్కు కొత్త గుబులు పట్టుకుంది.. కనీసం పాత స్థానాలైనా గెలుస్తామా లేదా అని ఆందోళనల కలిగి ఉంది. ఇక మజిలీస్ పార్టీ గతంలో 16 స్థానాలు గెలువగా అక్కడ కాంగ్రెస్ నుంచే గట్టి పోటీ ఎదుర్కొంటుంది… 22 స్థానాల్లో మైనార్టీల ప్రాబల్యం ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ దీటైన అభ్యర్థులను బరిలో దించడం పతంగి పార్టీ ని కలవర పెడుతుంది… ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మేయర్ స్థానం కోసం ఆ పార్టీ మద్దతు ఉంటుందని నాయకులు నమ్మకం పెట్టుకున్నారు.. గతంలో మాదిరిగా డిప్యూటీ మేయర్ స్థానం కోసం పట్టుబట్టాలంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది.


