సర్వే చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే
. . . ప్రైవేట్ అసిస్టెంట్ ల ద్వార వసూళ్లు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
భూమిని సర్వే చేసి రిపోర్టు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్న సర్వేయర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తన చేతికి మట్టి అంటకుండా మండలం లో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను సహయకులుగా పెట్టుకుని లంచం తీసుకుంటున్న సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం పట్టుకున్నారు.. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి ఎక్కల దేవి కుమార స్వామి సర్వేయర్ గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను వ్యక్తిగత సహయకులుగా నియమించుకుని లంచాలకు సర్వే చేయడం రిపోర్టులు ఇవ్వడం చేస్తున్నారు. సైదాపూర్ మండలం అమ్మన్ గుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి తన భూమి సర్వే కోసం రెవెన్యూ శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత వ్యక్తి భూమి సర్వే చేయాలంటే రూ.25,000 డిమాండ్ చేశారు సర్వేయర్ కుమార స్వామీ. సర్వేయర్ వ్యక్తిగత సహాయకుడు వంగ విహిత్ రెడ్డి ద్వార యుపిఎ గా రూ.5000 లంచం గత నెల 23న స్వీకరించారు. అతని ద్వారా రూ.10 వేలు నగదు రూపంలో తీసుకున్నారు. శుక్రవారం సర్వేయర్ కుమారా స్వామి తన వ్యక్తిగత సహాయకుడు తీగల రాజేష్ ద్వార 10 వేలు స్వీకరిస్తుంది రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో సర్వేయర్ తోపాటు ఇద్ధరు ప్రైవేట్ సహాయకులను అరెస్టు చేసి కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్ విధించినట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు…