నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
కరీంనగర్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై అర్ధాంతరంగా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో ఎలక్ట్రికల్ బస్సు ఆగిపోయింది. సిగ్నల్ క్రాస్ అయ్యే సమయంలో నడిరోడ్డులో బస్సు నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సిగ్నల్ ను గుర్తించకుండా బస్సు అడ్డంగా ఉండడంతో రోడ్డుకు మూడువైపుల నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది.

బస్సులో వచ్చిన ప్రయాణికులను ఎన్టీఆర్ చౌరస్తాలోనే దించివేశారు. డిపో నుంచి మెకానిక్ లను తీసుకువచ్చి మరమ్మత్తులు చేయిస్తున్నారు. దాదాపు గంట సేపు ఆర్టీసీ బస్సు కారణంగా ధర్నాచౌక్ లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుళ్ళను ఏర్పాటు చేసి ట్రాఫిక్ జాం కాకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
