22.7 C
Hyderabad

సర్పంచుల ఫోరం మండల అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

.. మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల సర్పంచుల పోరంల మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, ప్రధాన కార్యదర్శి రోహిత్ గౌడ్ లను మంగళవారం భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర సీనియర్ నాయకులు పాశం కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందల్వాయి మండలాన్ని అన్నివిధాల అభివృద్ధి జరిగేలా సర్పంచులు కృషి చేయాలన్నారు.అలాగే మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోతుకూరి నవీన్ గౌడ్,గట్టు కడారి, ఇందల్వాయి తాండ గ్రామ శాఖ అధ్యక్షులు వసంత్ రావు, డాక్టర్ శ్రీధర్, నారా గౌడ్, గొల్ల సాయిలు, రాజు, బోదరి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article