. . . హోలీ పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు
. . . లోతట్టు ప్రదేశాల్లో స్నానాల సమయంలో యువత జాగ్రత్తలు పాటించాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
హోలీ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సాంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు. ఈ హోలీ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల నియంత్రణ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలు హోలీ అనంతరం చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో యువత తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. జిల్లా ప్రజలంతా శాంతియుతంగా హోలీ పండుగను జరుపుకుని పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమీషనర్ కోరారు.
