రేకుల షెడ్డు లో నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

0 1,221

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని మాచరెడ్డి మండల కేంద్రంలో గల ఎస్ కే డి జి పాఠశాలపై,  నాగిరెడ్డిపేట్ మండలంలో  నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్ లో నడుపుతున్న కేరళ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. రేకుల షెడ్ లో నడవడం వల్ల విద్యార్థులు వేడికి తట్టుకోలేకపోతున్నారని, వర్షం పడితే అ శబ్దం కి విద్యార్తులు భయపడుతున్నారని అన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం రేకుల షెడ్లలో పాఠశాలలో నడపద్దని విద్య హక్కు చట్టం చెబుతున్న అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేకుల షెడ్లలో ప్రమాదాలకు గురై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి ఆటస్థలం గాని సరైన మౌలిక సదుపాయాలు లేవన్నారు.విద్యార్థులకు సరైన  టాయిలెట్ లు లేవన్నారు. కావున నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్న ఎస్ కె డీ జీ ,కేరళ పాఠశాలపై చర్యలు తీసుకొని అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జివియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు మణికంఠ, బీవీఎం జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.