. . . రెండున్నర ఏళ్లలో సీడీపీ నిధులు శూన్యం
. . . హిందూ దేవుళ్ళ జోలికి వస్తే సహించేది లేదు
. . . విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అన్నారు. నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమేనని, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ బిజెపి మాత్రమే అని అన్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి పది కోట్లు కేటాయించారని, ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలుపాలన్నారు. అర్బన్ ను 500 కోట్లతో అభివృధ్ది చేశామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కాపీ కొడుతున్నారన్నారు. దేశంలో సీడీపీ, ఫండ్ ఇవ్వని రాష్ట్రం ఏది లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇలా వ్యవహరిస్తుందని అన్నారు. ఫండ్ లేకుండా గ్రామాలకు ఎలా వెళ్లాలని 26 నెలలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అడగడం విడ్డూరమన్నారు. అర్బన్ లో ముఖ్యమైన అంశాల మీద ఫోకస్ పెట్టీ, సమస్యలపై సిఎంకు, మంత్రులకు ఇప్పటివరకు అనేక ఉత్తరాలు రాశారని ఒక్కదానికి కూడా సమాధానం లేదన్నారు. టిఆర్ఎస్ పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో విఫలమయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు అని చెప్పి సగం కూడా సాంక్షన్ చేయలేదన్నారు. నిజామాబాద్ బస్టాండ్, ప్రభుత్వాసుపత్రి, కళాభారతి గురించి ఉత్తరాలు రాసిన అటు సీఎం కానీ ఇటు పిసిసి కానీ పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం అన్నారు. రేవంత్ రెడ్డి గద్దె కోసం కేవలం హిందూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తర్వాత విమర్శించడం ముమ్మాటికి తగదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ రాముడు గురించి మాట్లాడటం మానుకోవాలని హెచ్చరిస్తూ ఆ రాముడి ఆశీర్వాదంతోనే ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ , దేశంలో 21 రాష్ట్రాలలో అధికారంలో ఉందన్నారు. ఏమీ చేయని మీకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. నిజామాబాద్ బరాబర్ ఇందూరేనని, కార్పొరేషన్ గెలుచుకోగానే పేరును మార్చే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. హిందూ దేవతలు అలుకగా దొరికారా. హిందూ దేవుళ్ళ జోలికి వస్తె ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,పోతంకర్ లక్ష్మి నారాయణ,బీజేపీ జిల్లా కార్యదర్శి జోతి, బీజేపీ నాయకులు న్యాలం రాజు,ప్రమోద్,ప్రభాకర్,తారక్ వేణు,ఇప్పకాయల కిషోర్,బట్టు రాఘవేందర్,మల్లేష్ యాదవ్, పుట్ట వీరేందర్, హరీష్ రెడ్డి, కార్తీక్, మధు,భాస్కర్, విజయ్,వినోద్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
